ఇటు మెకానిక్‌ రాకీ.. అటు లైలా! | Vishwak Sen Mechanic Rocky First Look Out | Sakshi
Sakshi News home page

ఇటు మెకానిక్‌ రాకీ.. అటు లైలా!

Mar 30 2024 6:21 AM | Updated on Mar 30 2024 6:21 AM

Vishwak Sen Mechanic Rocky First Look Out - Sakshi

బర్త్‌ డే (మార్చి 29) రోజున హీరో విశ్వక్‌ సేన్‌ డబుల్‌ ధమాకా అందుకున్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించనున్న రెండు కొత్త సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. విశ్వక్‌ టైటిల్‌ రోల్‌లో నటించనున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో నరేశ్, ‘వైవా’ హర్ష, హర్షవర్ధన్‌ కీలక పాత్రల్లో నటిస్తారు. రవితేజ ముళ్లపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రామ్‌ తాళ్లూరి నిర్మించనున్నారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టైటిల్‌ లుక్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ స్వరకర్త.

అలాగే విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించనున్న మరో సినిమా ‘లైలా’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నారు. ఈ సినిమాలో సెకండాఫ్‌లో లైలా అనే అమ్మాయిగా విశ్వక్‌ కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాలే కాకుండా విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అనే సినిమా చేస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 17న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement