తీవ్రంగా గాయపడిన 'కలర్ ఫోటో' హీరోయిన్ | Tollywood Actress Chandini Chowdary Injury News | Sakshi
Sakshi News home page

Chandini Chowdary: గాయాన్ని లైట్ తీసుకుంది.. ఇప్పుడేమో బాధపడుతూ

Nov 5 2024 12:44 PM | Updated on Nov 5 2024 1:10 PM

Tollywood Actress Chandini Chowdary Injury News

'కలర్ ఫోటో' మూవీతో హీరోయిన్‌గా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి. చాందిని చౌదరి.. తీవ్రంగా గాయపడింది. ఆ విషయాన్ని ఈమెనే స్వయంగా బయటపెట్టింది. అయితే చాన్నాళ్ల క్రితం ఇది జరగ్గా.. తాను లైట్ తీసుకున్నానని ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్‌ని భయపెట్టిన బిచ్చగాడు)

చాందిని ఏం చెప్పింది?
'హలో.. నేను గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నాకు ఓ గాయమైంది. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టింది. షూట్ కోసం వెళ్తుంటే గాయం వల్ల మరింత నొప్పిగా అనిపిస్తుంది. దీంతో అన్నింటికి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాలోకి వస్తా' అని చాందిని చౌదరి ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.

షార్ట్ ఫిల్మ్స్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన చాందిని చౌదరి.. టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ చిత్రాలతో వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త మూవీలో నటిస్తోంది. బహుశా ఈమెకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు ఉంది. అందుకే కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుంటానని చెప్పినట్లు అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement