 
													పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం షారుఖ్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో ‘జవాన్’పై టాలీవుడ్‌లో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సైతం ‘జవాన్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూస్తానని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన కోరుకున్నాడు.
మహేశ్.. నీతో కలిసి సినిమాకు వస్తా: షారుఖ్
తన సినిమా గురించి మహేశ్ బాబు ట్వీట్ చేయడం పట్ల షారుఖ్ స్పందించాడు. ఈ చిత్రం కచ్చితంగా మహేశ్‌కు నచ్చుతుందని, తాను కూడా మహేశ్‌తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ‘థ్యాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. ‘జవాన్’నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఈ సినిమాను చూడాలనుకుంటున్నావో చెబితే.. నేను కూడా నీతో కలిసి సినిమాకు వస్తా. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు’అని షారుఖ్ ట్వీట్ చేశాడు. కాగా, మహేశ్, షారుఖ్ మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. గతంలో మహేశ్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా సెట్‌కి షారుఖ్ వెళ్లి సందడి చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. 
Thank u so much my friend. Hope you enjoy the film. Let me know when you are watching I will come over and watch it with you. Love to you and the family. Big hug. https://t.co/xW0ZD65uvk
— Shah Rukh Khan (@iamsrk) September 6, 2023

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
