'కాంతార చాప్టర్ 1' ఫస్ట్‌ లుక్‌ వీడియో.. రిషబ్‌ శెట్టి ఉగ్రరూపం | Sakshi
Sakshi News home page

Kantara Chapter-1 First Look Teaser:'కాంతార చాప్టర్ 1' ఫస్ట్‌ లుక్‌ వీడియో.. రిషబ్‌ శెట్టి ఉగ్రరూపం

Published Mon, Nov 27 2023 12:58 PM

Rishab Shetty Kantara A Legend Chapter-1 First Look Teaser - Sakshi

కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్‌ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్‌ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రిషబ్‌ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపిస్తున్నాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో సుమారు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
Advertisement