డిసెంబరులో ఆరంభం | Sakshi
Sakshi News home page

డిసెంబరులో ఆరంభం

Published Sat, Mar 30 2024 12:19 AM

Prabhas To Begin Spirit Shoot By December 2024 - Sakshi

ఈ ఏడాది డిసెంబరులో పోలీసాఫీసర్‌గా ప్రభాస్‌ చార్జ్‌ తీసుకోనున్నారని తెలిసింది. హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్‌’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించనున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

కాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించేలా ప్లాన్‌ రెడీ చేస్తున్నారట సందీప్‌ రెడ్డి వంగా. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం రష్మికా మందన్నా, కీర్తీ సురేష్, మృణాల్‌ ఠాకూర్‌ వంటివార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించనున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో రిలీజ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement