నేడు లియో వేడుకలు.. పట్టుబట్టి సాధించుకున్న విజయ్‌ ఫ్యాన్స్‌ | Leo Movie Success Meet On November 1 | Sakshi
Sakshi News home page

Leo Movie Success Meet: నేడు లియో వేడుకలు.. పట్టుబట్టి సాధించుకున్న విజయ్‌ ఫ్యాన్స్‌

Nov 1 2023 12:19 PM | Updated on Nov 1 2023 12:30 PM

Leo Movie Success Meet - Sakshi

దళపతి విజయ్ నటించిన 'లియో' చిత్రం థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 12 రోజుల్లో రూ.540 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాత ప్రకటించారు. ఇది అబద్ధం అని చాలా మంది అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా చిత్ర బృందం లియో విజయంపై సంబరాలు జరుపుకుంటోంది.

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా లియో నిలిచింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. అందుకే ఇప్పుడు విజయ్ అభిమానులతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడకకు కూడా తమిళనాడు ప్రభుత్వం మొదటగా అనుమతి ఇవ్వలేదు. కానీ అభిమానుల ఒత్తడి వల్ల లియో విజయోత్సవ వేడుకలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై లియో టీమ్ ఓ వీడియోతో అధికారిక ప్రకటన చేసింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన లియో చిత్రం మంచి విజయం సాధించింది. అక్టోబర్ 19న ఈ సినిమా వెండితెరపైకి వచ్చింది.  ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు గానూ లియో టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహిస్తోంది. నవంబర్ 1వ తేదీ బుధవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయింత్రం చెన్నైలో జరగనున్న ఈ షోకు సంబంధించిన చిన్న ప్రోమో వీడియోను కూడా చిత్ర నిర్మాతలు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంతా పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం క్యాన్సిల్ కావడంతో సక్సెస్ మీట్ ఘనంగా జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement