కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్ | Kantara Chapter 1 Team Clarity On delay rumours October release | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1: కాంతార ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా.. స్పందించిన టీమ్

Apr 2 2025 7:00 PM | Updated on Apr 2 2025 7:30 PM

Kantara Chapter 1 Team Clarity On delay rumours October release

కాంతార  మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి.  2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే కాంతార చాప్టర్ 1ను ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్‌ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డేట్‌ కూడా రివీల్ చేశారు.

అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంతార చాప్టర్-1 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ వాయిదా పడుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి కాంతార టీమ్ స్పందించింది.

ఎట్టి పరిస్థితుల్లో కాంతార చాప్టర్‌ -1 మూవీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించింది. ముందు అనుకున్నట్లుగానే అక్టోబర్ 02వ తేదీ 2025న థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.

కాగా.. ఇటీవల 500 మంది  యోధులతో ఓ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో దాదాపు 3 వేల మంది భాగమయ్యారు. దీని కోసం రిషబ్ శెట్టి మూడు నెలల పాటు గుర్రపు స్వారీ, కలరి, కత్తియుద్ధం నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ సన్నివేశాన్ని కర్ణాటకలోని పర్వతా ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2022 చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా బనవాసికి చెందిన కదంబరాజుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా  తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement