Jr NTR Spoke With His Fan Janardhan Mother On Phone Call - Sakshi
Sakshi News home page

Jr NTR:ఎన్టీఆర్‌ గొంతు విని కోమాలో ఉన్న అభిమాని వేళ్లు కదిలించాడు!

Jun 29 2022 7:14 PM | Updated on Jun 29 2022 7:35 PM

Jr NTR Spoke With His Fan Janardhan Mother On Phone Call - Sakshi

. నీకోసం నేనున్నాను, మన అభిమానులున్నారు. అందరూ నీ మంచి కోరుకుంటారు. నువ్వు త్వరగా కోలుకుని వచ్చేసేయ్‌, కలుద్దాం. నీకేం అవదు అంటూ భరోసా ఇచ్చాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌.. అభిమానులకు ఈయన పేరొక జపం. ఆయన్ను ఒక్కసారి చూడాలని, కలిసి ఫొటో దిగాలని ఎదురుచూసే జనాలు ఎంతోమంది. అటు ఎన్టీఆర్‌ కూడా తనను ఎంతగానో ఆరాధించే అభిమానులను అమితంగా ప్రేమిస్తాడు. తాజాగా తారక్‌.. కోమాలో ఉన్న తన అభిమాని జనార్ధన్‌తో, అతడి తల్లితో మాట్లాడాడు. అధైర్యపడకుండా దేవుడిని నమ్మండని జనార్ధన్‌ తల్లికి నచ్చజెప్పాడు. త్వరలోనే అతడు కోలుకుని వస్తాడని భరోసా ఇచ్చాడు.

ఆ తర్వాత జనార్ధన్‌ దగ్గర ఫోన్‌ పెట్టగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. 'నేను ఎన్టీఆర్‌ను మాట్లాడుతున్నాను, నువ్వు త్వరగా కోలుకుంటే మనం కలుద్దాం. మేం అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. నిన్ను చూడాలని ఉంది. త్వరగా కోలుకుని వచ్చేయ్‌, నీకోసం ప్రార్థిస్తున్నాం. నీకోసం నేనున్నాను, మన అభిమానులున్నారు. అందరూ నీ మంచి కోరుకుంటారు. నువ్వు త్వరగా కోలుకుని వచ్చేసేయ్‌, కలుద్దాం. నీకేం అవదు' అంటూ భరోసా ఇచ్చాడు. తారక్‌ మాట్లాడుతుంటే కోమాలో ఉన్న జనార్ధన్‌ వేళ్లు కదిలిస్తున్నాడని అక్కడున్నవాళ్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌గా మారాయి.తారక్‌ మాటలతో కోమాలో ఉన్న అభిమాని వేళ్లు కదలించాడు.

చదవండి:  ఆ షోకి అనసూయ గుడ్‌బై.. చేదు క్షణాలంటూ ఎమోషనల్‌ పోస్ట్‌
రాజమౌళి మగధీరలో ఆఫర్‌ ఇచ్చారు, కానీ నేనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement