వైరల్‌ అవుతోన్న జూ. ఎన్టీఆర్‌ అరుదైన వీడియో..

Jr NTR Childhood Classical Dance Video Goes Viral - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌... టాలీవుడ్‌లో ఈపేరు చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎంతటి టాలెంటెడ్‌ నటుడో.. అంతే మంచి డ్యాన్స్‌ర్‌ కూడా. హీరోగా, డ్యాన్స్‌ర్‌గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్‌. వెస్టర్న్‌తో పాటు ఆయన క్లాసీకల్‌ డ్యాన్స్‌ కూడా నేర్చుకున్న సంగతి తెలిసిందే. బాలరామయణం సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టిన తారక్‌.. అంతకు ముందు క్లాసికల్‌ డ్యాన్సర్‌గా పలు స్టేజ్‌ షోలు ఇచ్చాడు.

అయితే ఆ వీడియోలను చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా తారక్‌ భరత నాట్యంకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టీనేజ్‌లో ఉండగా ఎన్టీఆర్‌ స్టేజ్‌పై నాట్యం చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసి ఆయన అభిమానులు తెగ మురిసిపోతూ పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌కు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ అంటే అమితమైన ఆసక్తి ఉండేదట.

అది తెలిసి ఆయన తల్లి శాలిని నృత్యకళలో శిక్షణ ఇప్పించారట. డ్యాన్స్‌ నేర్చుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్‌ స్టేజ్‌పై నృత్యకళ ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ కోమరం భీంగా కనిపించనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: 
కొడుకుతో జూనియర్‌ ఎన్టీఆర్‌ షికారు
చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్‌.. ఇక్కడ బ్లాక్‌బస్టర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top