Junior NTR, Kalyanram And Chiranjeevi Wishes To Nandamuri Balakrishna On His Birthday - Sakshi
Sakshi News home page

HappyBirthdayNBK: బాబాయ్‌కి అబ్బాయిలు ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ బర్త్‌డే విషెస్‌

Jun 10 2021 11:58 AM | Updated on Jun 10 2021 3:11 PM

Jr NTR And Chiranjeevi  Wishes To Nandamuri Balakrishna - Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ 61వ పుట్టిన రోజు నేడు(జూన్‌ 10). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు  సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చిరంజీవి చేసిన ట్వీట్లు, చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి. 

తన బాబాయ్‌కు ఎర్లీ మార్నింగ్‌ బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు ఎన్టీఆర్‌. ‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా బాబాయ్‌ బాలయ్యది ఓ అరుదైన ఫోటో పంచుకున్నారు. కల్యాణ్‌ రామ్‌ సైతం ‘61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను’అని బాబాయ్‌కి బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇక మెగాస్టార్‌ చిరంజీవి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ చేశారు. ‘మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్ వేశారు.

చదవండి:
Akhanda: బాలయ్య బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. నవ్వుతూ నటసింహం అలా.. 

మీ వల్లే ఇంతటివాడినయ్యాను, ప్లీజ్‌..: బాలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement