
జాతీయ అవార్డులనీ ప్రకటించారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాలు ఈసారి మంచి దూకుడు చూపించాయి. అయితే అవార్డ్ విజేతలు ఎవరనేది తెలిసిపోయింది. మరి వాళ్లకు పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారో తెలుసా?
(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)
జాతీయ సినీ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి ఇస్తారు. అలానే గుర్తింపుగా ప్రశంస పత్రాలను బహుకరిస్తారు. జ్యూరీ అభినందనల అందుకున్న సినిమాలకు మాత్రం సర్టిఫికేట్ మాత్రమే దక్కుతుంది. జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది.
తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్ విన్నర్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ పాపులర్ చిత్రం, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగాలకు మాత్రం రూ.3 లక్షల డబ్బు.. మిగిలిన అందరూ విజేతలకు మాత్రం రూ.2 లక్షల నగదు లభిస్తుంది.
(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)