gopichand seetimaarr movie release date postponed - Sakshi
Sakshi News home page

గోపీచంద్‘సీటీమార్‌’ విడుదల వాయిదా.. కారణం ఇదే

Mar 28 2021 8:19 AM | Updated on Mar 28 2021 9:54 AM

Gopichand Seetimaarr Movie Release Date Push - Sakshi

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది.

గోపీచంద్‌ ఆట వాయిదా పడింది. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో  రూపొందిన చిత్రం ‘సీటీమార్‌’. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ పాత్రలో గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్‌ పాత్రలో తమన్నా నటించారు.

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. ‘‘పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఇంకా పూర్తి కాలేదు. ఆడియన్స్‌కు థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబందం పేర్కొంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement