చిరంజీవి-బాబీ.. క్లారిటీ వచ్చింది | Megastar Chiranjeevi And Bobby Movie Look Test Details, KVN Productions Confirms Project On Track, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Chiranjeevi: రూమర్స్‌కి చెక్ పెట్టేశారు.. దర్శకుడి ట్వీట్ వైరల్

Apr 28 2026 5:02 PM | Updated on Apr 28 2026 5:13 PM

Chiranjeevi Bobby Movie Look Test Details

సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. తర్వాత మూవీని సమయానికి మొదలుపెట్టకపోయేసరికి ఎక్కడ లేని రూమర్స్ అన్నీ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ తీయాల్సిన నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్.. జన నాయగణ్, టాక్సిక్ చిత్రాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటమే దీనికి కారణం. అయితే చిరు-బాబీ సినిమా నుంచి కేవీఎన్ తప్పుకొందని, మరో నిర్మాత కావాల్సి ఉందని రకరకాల పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ దాదాపు చెక్ పడిపోయింది.

(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్‌స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)

రీసెంట్‌గానే నిర్మాణ సంస్థ మారిపోయిందనే రూమర్స్‌ని కేవీఎన్ ప్రొడక్షన్ ఖండించగా.. ఇప్పుడు దర్శకుడు బాబీ, చిరంజీవికి ఈరోజు(ఏప్రిల్ 28) లుక్ టెస్ట్ జరిగిందనే సంగతి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరోవైపు ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని, ప్రాజెక్ట్ లాంచ్ కాగానే ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో షూటింగ్ మొదలవుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే 'కాకాజీ' అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ పేరుపై మెగా అభిమానుల్లో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. టైటిల్ ఏమంత పవర్‌ఫుల్‌గా లేదని అనుకుంటున్నారు. మరి ఇదే పేరు ఫిక్స్ చేస్తారా లేదంటే ఏమైనా చేర్పులు మార్పులు ఉండబోతున్నాయా అనేది చూడాలి? ఇందులో ప్రముఖ నటీనటులు కూడా చాలామందే కనిపించబోతున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే కేసు పెడతా: అషురెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement