ఆ సినిమాపై సెన్సార్ అభ్యంతరం.. రాజీపడని నిర్మాత! | Bharateeyans Movie Censor Board Issue | Sakshi
Sakshi News home page

Censor Board: సెన్సార్ బోర్డు తీరుపై ఆ చిత్ర నిర్మాత కామెంట్స్!

Jun 19 2023 4:55 PM | Updated on Jun 19 2023 4:56 PM

Bharateeyans Movie Censor Board Issue - Sakshi

మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు విఫలయత్నాలు చేస్తూ, అనునిత్యం హేయమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా దురహంకారానికి వ్యతిరేకంగా తీసిన 'భారతీయన్స్' చిత్రానికి సినిమాకు సెన్సార్ పరంగా కలుగుతున్న అసౌకర్యంపై చిత్ర నిర్మాత, ప్రవాస భారతీయుడు డా.శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాతృదేశంపై తన అభిమానం, మమకారంతో లాభాపేక్ష లేకుండా ఎంతో కష్టపడి నిర్మించిన 'భారతీయన్స్'కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యంపై శంకర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా.. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషాచిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ('ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా' ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు, 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లాంటి ప్రముఖులతోపాటు మాజీ సైనికాధికారుల ప్రశంసలు పొందిన 'భారతీయన్స్' చిత్రంలోని చైనా పేరుని, గల్వాన్ వ్యాలీ పేరును తొలగించాలని సెన్సార్ బోర్డ్ చేసిన సూచనతో తాను విభేదిస్తున్నానని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని నిర్మాత శంకర్ నాయుడు తేల్చి చెప్పారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement