'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

'బేబీ' కథ నాదేనంటూ.. దర్శక, నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు

Published Sat, Feb 10 2024 9:55 AM

Baby Movie Story Copyright Issue - Sakshi

బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్‌ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా 'బేబీ' సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్‌ దర్శకత్వం వహిస్తే ఎస్‌కేఎన్‌ నిర్మాతగా తెరకెక్కించారు.

(ఇదీ చదవండి : వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: టాప్‌ హీరోయిన్‌)

ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్‌ సాయి రాజేశ్‌కు తాను చెప్పానంటూ శిరిన్‌ శ్రీరామ్‌ తాజాగా తెలుపుతున్నాడు. వారు కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు.   2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ కోరినట్లు శ్రీరామ్‌ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు ఆయన తెలుపుతున్నాడు.

పోలీసులు చెబుతున్న ప్రకారం. ' 2015లో 'కన్నా ప్లీజ్‌' టైటిల్‌తో శ్రీరామ్‌ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు  'ప్రేమించొద్దు' అని టైటిల్‌ పెట్టుకున్నారు. డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 2023లో 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేశ్‌ డైరెక్టర్‌గా ఎస్‌కేఎన్‌,  ధీరజ్‌ మొగిలినేని సహ నిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన 'ప్రేమించొద్దు' స్టోరీనే అని శిరిన్‌ శ్రీరామ్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement