రూ. 20 కోట్ల లగ్జరీ ఇల్లు.. నాది కాదు: యాంకర్‌ స్రవంతి | Anchor Sravanthi Reacts On Luxury 20Crore Villa Rumours, Calls It Just Social Media Speculation, Read Full Story | Sakshi
Sakshi News home page

రూ. 20 కోట్ల విల్లా నాది కాదు..: యాంకర్‌ స్రవంతి

Apr 29 2026 9:41 AM | Updated on Apr 29 2026 10:08 AM

Anchor Sravanthi Comment Her Luxury 20CR Villa

యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు..  తన చురుకైన మాటలు, అందంతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌, యాంకర్‌, నటి, ఇలా పలు రంగాల్లో దూసుకుపోతూ సోషల్ మీడియాలో తరుచుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది. యాంకర్ సుమ, అనసూయ, శ్రీముఖిల మాదిరిగానే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్‌ చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరికి చెందిన స్రవంతి మధ్యతరగతి అమ్మాయే.. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె భారీగా సంపాధిస్తుందని, రూ. 20 కోట్లతో హైదరాబాద్‌లో ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనేసిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.

గోదారి గట్టుపైన సినిమా కార్యక్రమంలో  యాంకర్‌ స్రవంతిని నటుడు సుదర్శన్‌ ఒక ప్రశ్న అడిగారు. 'మీకు రూ. 20 కోట్ల విల్లా ఉందని వార్తలు వస్తున్నాయి నిజమేనా..?' అన్నారు. అందుకు ఆమె కూడా  చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది.  తనకు లగ్జరీ విల్లా ఉందనే విషయం కేవలం రూమర్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కొందరు ఇలాంటి ప్రచారాలు చేయడం సహజమేనని ఆమె చెప్పింది. భవిష్యత్‌లో మంచి ఇల్లు కొనాలనే  ఆకాంక్ష అందరికీ ఉంటుందని ఆమె తెలిపింది. పుష్ప -1 రిలీజ్ సమయంలో రాయలసీమ స్లాంగ్‌తో అల్లు అర్జున్‌ ఇంటర్వ్యూ చేసి స్రవంతి పాపులర్‌ అయింది. అలా ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. సున్నా నుంచి మొదలు పెట్టిన స్రవంతి ప్రయాణం  ఎన్నో కష్టాలను దాటుకుని మంచి స్థానానికి చేరుకుందని తన గురించి తెలిసిన వారు బహిరంగంగానే చెబుతుంటారు.

యాంకర్‌ స్రవంతి ఆర్థిక స్థితిపై ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి ప్రముఖ యాంకర్లు, డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్లందరూ కూడా సినీ నటులతో సమానంగా సంపాదిస్తున్నారనే  అభిప్రాయానికి నెటిజన్లు రావడమే ఇలాంటి రూమర్స్‌కు కారణమని చెప్పవచ్చు. ఆపై యాంకర్లు తరచుగా ప్రయాణాలు చేస్తూ, ఆన్‌లైన్‌లో ఆడంబరమైన జీవితాన్ని ప్రదర్శించడం వల్లే ఇలాంటి అభిప్రాయానికి కారణం అవుతుంది. అసలు వాస్తవం మరోలా ఉంటుందని పలు సందర్భాల్లొ వారు చెప్పిన విషయం తెలిసిందే. తమ కాస్ట్యూమ్స్‌, మేకప్‌ ఖర్చులకే సగం రెమ్యునరేషన్‌ పోతుందని చాలామంది చెబుతుంటారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement