కూలీ టు స్మగ్లర్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో బన్నీ (అల్లు అర్జున్) పాత్ర పేరు ‘పుష్పరాజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. బన్నీది స్మగ్లర్ పాత్ర అని కూడా అందరికీ తెలుసు. అయితే స్టోరీ లైన్ ఏంటంటే... మొదట కూలీగా పని చేసే వ్యక్తి తర్వాత కాలంలో స్మగ్లర్‌గా ఎలా మారాడు? అనేది ప్రధానాంశమని తెలిసింది. కూలీ నుంచి స్మగ్లర్‌గా మారే క్రమాన్ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని, ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి