నాట్స్‌ ఆలోచన సంతోషాన్నిచ్చింది: అల్లు అరవింద్‌

Allu Aravind Interesting Comments on NATS Meeting in Hyderabad - Sakshi

‘‘మా నాన్న అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్, ఘంటసాలగార్ల శతజయంతి ఉత్సవాలను అమెరికాలో నిర్వహించనుండటం సంతోషం. ఈ ఆలోచన చేసిన ‘నాట్స్‌’వారికి థ్యాంక్స్‌’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ప్రముఖ నటులు ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలను మే 26, 27, 28 తేదీల్లో ‘నాట్స్‌’ (ఉత్తర అమెరికా తెలుగు సమితి) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించ నున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘నాట్స్‌’ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ.. ‘‘అమెరికాలోని తెలుగువారికి కష్టం వస్తే సామాజికంగా, ఆర్థికంగా భరోసా ఇచ్చే సంస్థే ‘నాట్స్‌’’ అన్నారు. ‘‘నటులుగా 50 సంవత్సరాలు(గోల్డెన్‌  జూబ్లీ) పూర్తి చేసుకుంటున్న జయసుధ, సాయికుమార్‌గార్లను,  ‘ఆస్కార్‌’ అవార్డు గ్రహీత చంద్రబోస్‌లను న్యూజెర్సీలో సత్కరిస్తాం’’ అన్నారు ‘నాట్స్‌’ కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసాని. ఈ వేడుకలో ‘నాట్స్‌’ డిప్యూటీ కన్వీనర్‌ రాజ్‌ అల్లాడ, నటులు సాయికుమార్, ఆది, డైరెక్టర్లు ఎ.కోదండరామి రెడ్డి, బి.గో΄ాల్, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు 
పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top