20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత | Akshay Kumar dominates the 100 crore club in Bollywood Cinema | Sakshi
Sakshi News home page

20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత

Apr 27 2026 11:45 PM | Updated on Apr 27 2026 11:48 PM

Akshay Kumar dominates the 100 crore club in Bollywood Cinema

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్‌లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్‌లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.  

2012లో హౌస్‌ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్‌లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్‌లు కూడా 100 కోట్ల క్లబ్‌లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement