డెకాయిట్‌లో అందాల చిచ్చుబుడ్డి ఫోటోలు వైరల్‌.. ఎవరో తెలుసా? | Actress Zayn Marie Khan Trending After Dacoit Event | Sakshi
Sakshi News home page

డెకాయిట్‌లో అందాల చిచ్చుబుడ్డి ఫోటోలు వైరల్‌.. ఎవరో తెలుసా?

Apr 6 2026 11:07 AM | Updated on Apr 6 2026 11:14 AM

Actress Zayn Marie Khan Trending After Dacoit Event

అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్‌’.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి జైన్‌ మేరీ ఖాన్‌(31) ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షానిల్‌ డియోల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి , సునీల్, కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్‌ నటిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.

బాలీవుడ్‌ దర్శక–నిర్మాత మన్సూర్‌ ఖాన్‌ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు జైన్‌ మేరీ ఖాన్‌(Zayn Marie Khan) . డెకాయిట్‌ చిత్రంతో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఒక్క ఈవెంట్‌తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జైన్ పని చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన  మిసెస్ సీరియల్ కిల్లర్ సినిమాతో జైన్ మేరీ ఖాన్  ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్(2022) మూవీలో ఛాన్స్‌ దక్కించుకుని మెప్పించారు. ఆకాష్ మొహిమెన్‌ను ప్రేమించి 2021లో ఆమె పెళ్లి చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement