ఉత్సాహంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఎడ్ల బండ్లు ఊరేగించారు. అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు ఆలయం ముందు నుంచి వినాయక, వీరభద్ర, హనుమాన్ ఆలయాల వద్ద ఐదు సార్లు తిప్పారు. డప్పుల చప్పుళ్లు, యువకుల నృత్యాలు చేస్తుండగా.. ఊరేగింపు ముందుకు సాగింది. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రాజిరెడ్డి, కుమార్‌గౌడ్, రామకిష్టయ్య, శ్రీమన్‌రెడ్డి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎడ్ల బండ్ల ప్రదక్షిణలు..


