గర్భగుడికి తాళం | - | Sakshi
Sakshi News home page

గర్భగుడికి తాళం

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

గర్భగ

గర్భగుడికి తాళం

వెల్దుర్తి: ప్రముఖ శైవ క్షేత్రమైన బ్రహ్మగుండంలో శ్రీరాముల గుడిలో పూజలు చేయడం లేదు. మహాశివరాత్రి రోజు కనీసం గుడి తలుపులు తెరవలేదు. ఏకంగా స్వామివారి గర్భగుడికి తాళం వేశారు. దేవుడికే నిత్యం తాళం వేసిన వింత పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికై నా ఆలయ అధికారులు, నిర్వాహకులు స్వామి వారికి పూజాది కార్యక్రమాలు జరిగేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

వార్డుల వారీగా ఓటరు జాబితా

డీపీఓ జీ భాస్కర్‌

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేసే కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2026 జనవరి 1వ తేదీ వరకు ఉన్న అసెంబ్లీ ఓటరు జాబితాలను ఇప్పించాలని ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారిని కోరామన్నారు. అలాగే ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లను కలిసి అసెంబ్లీ ఓటరు జాబితాలను ఇప్పించుకోవాలన్నారు. మండలాల వారీగా తీసుకున్న అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా విభజన చేయాలన్నారు. ఈ ప్రక్రియను మార్చి 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు డీపీఓ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని 10,006 వార్డులకు ఓటరు జాబితాలను విభజించి సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

పోలీసుల చెంత బాలిక

ఆదోని టౌన్‌: ఆదోనికి చెందిన ఎనిమిదేళ్ల ధరణి అనే బాలిక శ్రీశైలం క్షేత్రంలో తప్పిపోయింది. ప్రస్తుతం ఆ చిన్నారి శ్రీశైలం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ రక్షణలో ఉంది. తన తల్లిదండ్రులు చౌడమ్మ, తిక్కయ్య అని, తాము ఆదోని నుంచి వచ్చామని చెబుతోంది. ధరణి తల్లిదండ్రులు గానీ, ఆ పాపను గుర్తించిన బంధుమిత్రులు వెంటనే శ్రీశైలంలోని కంట్రోల్‌ రూమ్‌ పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

నేటి పీజీఆర్‌ఎస్‌ రద్దు

కర్నూలు(సెంట్రల్‌): ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, కార్యదర్శులు, బిల్స్‌గేట్స్‌ బృందంతో కాన్ఫరెన్స్‌ కారణంగా పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని తెలిపారు.

ఫ్రీ ఆఫర్ల సందేశాలను నమ్మొద్దు

జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

కర్నూలు: ఫ్రీ ఆఫర్ల పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్‌ మ్యాచింగుల సందర్భంగా లైవింగ్‌ స్ట్రీమింగ్‌ చూడాలని ఆసక్తి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ చానల్స్‌, ఇతర వెబ్‌సైట్ల ద్వారా ఫ్రీ లైవ్‌ మ్యాచ్‌, వాచ్‌ ఐపీఎల్‌ ఫ్రీ, హెచ్‌డీ లైవ్‌ స్ట్రీనింగ్‌ వంటి పేర్లతో లింకులు పంపించి వాటిని క్లిక్‌ చేయగానే బ్యాంకు వివరాలు, ఓటీపీలు సేకరించి డబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి లింకులను క్లిక్‌ చేయడంతో మొబైల్‌లో మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్‌ వివరాలు దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారిక ప్రసార మాధ్యమాలు, చట్టబద్ధమైన యాప్‌లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎవరైనా మోసాలకు గురైనట్‌లైతే సైబర్‌ క్రైం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

గర్భగుడికి తాళం 1
1/1

గర్భగుడికి తాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement