బనశంకరి: సంచలనాత్మక బిట్‌కాయిన్ల కేసులో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నలపాడ్‌పై సిట్ అధికారులు చార్జిషీట్ వేశారు. ఇదే కేసుల్లో ఈడీ కూడా ఆయనపై దర్యాప్తు చేస్తోంది. తుమకూరు కంపెనీలో బిట్‌కాయిన్ల చోరీల్లో ప్రధాన నిందితుడు హ్యాకర్ శ్రీకృష్ణ నుంచి నలపాడ్‌కు, ఆప్త మిత్రులకు వాటా దక్కిందని సిట్ చార్జిషీటులో పేర్కొంది.
ఏమిటీ కేసు?
2017లో తుమకూరుకు చెందిన యూనికాయిన్ బిట్‌కాయిన్ ట్రేడింగ్ కంపెనీ వెబ్‌సైట్‌ను శ్రీకృష్ణ హ్యాక్ చేసి 60 కాయిన్లు (అప్పటి మార్కెట్ విలువ రూ.1.14 కోట్లు) దోచేశాడు. దీనిపై బాధితులు తుమకూరు కొత్త లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిట్ అధికారులు విచారించి శ్రీకృష్ణ, స్నేహితులు రాబిన్ ఖండేవాలా, మహమ్మద్ నలపాడ్‌తో పాటు మరికొందరిపై కోర్టులో ఇప్పుడు చార్జిషీట్ సమర్పించారు. దోచేసిన బిట్‌కాయిన్లను నలపాడ్ సాయంతో నగదుగా మార్చారు. ఇందులో నలపాడ్‌కు భాగం దక్కింది. ఆ డబ్బులతో నలపాడ్, రిటైర్డు ఐపీఎస్ కుమారుడు లగ్జరీ కారును కొనుగోలు చేశారు. మరోవైపు విచారణకు రావాలని నలపాడ్ కు ఈడీ 3వ సారి నోటీస్ పంపింది. ఇటీవల రెండుసార్లు జారీచేసినా హాజరు కాలేదు.
హ్యాకర్ శ్రీకృష్ణ, మహమ్మద్ నలపాడ్ పేర్లు
సిట్ చార్జిషీటు దాఖలు


