నాన్నకు జేజేలు | - | Sakshi
Sakshi News home page

నాన్నకు జేజేలు

Jun 14 2026 11:55 AM | Updated on Jun 14 2026 11:55 AM

నాన్నకు జేజేలు

కన్నవారి ఉన్నతికోసం తపించేవాడు నాన్నంటే

కలనైనా బిడ్డలకోసం యోచించేవాడు నాన్నంటే

బడబాలనం తనలోవున్నా చల్లనిసంద్రంలా వుంటాడు

బాధలెన్నో తనలోవున్నా దాచేసేవాడు నాన్నంటే

తనపిల్లల సౌఖ్యం కోసం కొండనైనా పిండిచేస్తాడు

పిల్లల సంతోషమే స్వర్గమనీ తలచేవాడు నాన్నంటే

నీ భవితకై నిరంతర తపన నిను శిఖరానికి చేర్చేనిచ్చెన

నీ కోసం తన ఆయువునైనా ఇచ్చేవాడు నాన్నంటే

ఇంటికోసం సర్వస్వము ధారపోసే త్యాగధనుడు

కొవ్వొత్తిలా ఓ దేవా! వెలుగునిచ్చి కరిగేవాడు నాన్నంటే

– బూర దేవానందం

కవి, రచయిత, సిరిసిల్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement