కదలరు..వదలరు | - | Sakshi
Sakshi News home page

కదలరు..వదలరు

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

● మెట్‌పల్లి ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు స్థానికంగా సొంతంగా ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇక్కడి నుంచి కదలడం లేదనే అభిప్రాయం ఉంది. ● మరోవైపు ఏళ్లుగా ఇక్కడే కొనసాగుతున్న వారి పనితీరుపైనా విమర్శలున్నాయి. తమ ప్రైవేట్‌ దందాపై ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ప్రభుత్వ విధులను నామమాత్రంగానే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. ● సాధారణంగా ఏ శాఖలోనైనా ఉద్యోగులను నిర్ధేశిత కాల పరిమితి ముగిసిన తర్వాత బదిలీ చేస్తారు. ● కానీ వైద్య శాఖలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో కొందరు వైద్యులు దశాబ్దానికి పైగా ఒక్కచోటనే తిష్ట వేసి ఉంటున్నారు. ఒకవేళ బదిలీ చేసినా డిప్యూటేషన్‌ ఉత్తర్వులు తెచ్చుకుంటూ అక్కడే కొనసాగుతున్నారు. ● ఇలాంటి వ్యవహారాల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ప్రస్తుతం జరుగుతున్న బదిల్లోనైనా ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఓ వైద్యుడు 2011లో విధుల్లో చేరారు. దశాబ్దం తర్వాత అతడిని మరోచోటుకు బదిలీ చేశారు. అయినా సదరు వైద్యుడు తిరిగి కొన్ని నెలలకే డిప్యూటేషన్‌పై మెట్‌పల్లికి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతున్నారు. స్థానికంగా ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వహిస్తున్న సదరు వైద్యుడు.. సుమారు పదిహేనేళ్లుగా ఇక్కడే తిష్ట వేయడం వెనుక ఆ శాఖ ఉన్నతాధికారుల సహకారముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే ఆసుపత్రిలో మరో వైద్యుడు 2008లో పోస్టింగ్‌ పొందారు. అనంతరం ఐదేళ్లకు మరో ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అయినా అక్కడకు వెళ్లకుండా డిప్యూటేషన్‌ తెచ్చుకుని ఇక్కడే ఉన్నారు. దశాబ్దం పాటు డిప్యూటేషన్‌పైనే కొనసాగిన ఆయన.. రెండేళ్ల క్రితం తిరిగి మెట్‌పల్లికే బదిలీ చేయించుకున్నారు. ఇతనికి కూడా ప్రైవేట్‌ ఆసుపత్రి ఉండడంతో ఇక్కడి నుంచి కదలడం లేదనే విమర్శలు ఉన్నాయి.

దశాబ్దానికి పైగా మెట్‌పల్లి ఆసుపత్రిలో తిష్ట

సొంత వైద్యంపైనే ప్రధానంగా దృష్టి

బదిలీ చేసినా డిప్యూటేషన్‌పై ఇక్కడే కొనసాగింపు

ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు

మెట్‌పల్లి: మెట్‌పల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యుల తీరుపై జోరుగా చర్చ సాగుతోంది. పదిహేనేళ్ల క్రితం విధుల్లో చేరిన వారు అప్పటినుంచి ఇక్కడే కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఇదే ఆసుపత్రికి ఎంతోమంది వైద్యులు వచ్చి.. కొన్నాళ్లకు బదిలీపై వె ళ్లిపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఇక్కడి నుంచి కదలడం లేదు. ఒకవేళ బదిలీ చేసినా డిప్యూటేషన్‌ ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైద్య శాఖలో బదిలీల ప్రక్రియ సాగుతోంది. ఉన్నతాధికారులు వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశమైంది.

ప్రైవేట్‌ దందా వల్లనే..

ఉన్నతాధికారుల అండతోనే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement