ఒక డ్యామ్‌.. భూమిని స్లో చేసింది

Three Gorges Dam China Is The Worlds Largest Hydro Facility - Sakshi

ప్రపంచంలోనే అతి భారీగా..
చైనాలోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యామ్‌.. 2.33 కిలోమీటర్ల పొడవునా 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీనితో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్‌ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుందని అంచనా.

రోజు పెరిగింది..
భారీ డ్యామ్, రిజర్వా యర్‌లో నిలిచే నీటి బరువు ఓవైపు.. డ్యామ్‌ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్‌ ఆఫ్‌ ఇనెర్షియా’ ప్రభావం ఏర్ప డిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణవేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు. అంతేకా దు ఈ భారీ డ్యామ్‌ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఏమిటీ ‘మూమెంట్‌ ఆఫ్‌ ఇనెర్షియా’?

వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం (ఇనెర్షియా) నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్‌ ఆఫ్‌ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్‌ డ్యామ్‌ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

త్రీగోర్జెస్‌ డ్యామ్‌ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల కదలికలు కూడా ప్రభావితమయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ డ్యామ్‌ను పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు.

త్రీగోర్జెస్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌.. భూమ్మీద మనుషులు నిర్మించిన డ్యామ్‌లలో అదీ ఒకటి అంతేకదా అంటారా.. కాదు.. అది అన్నింటిలో ఒకటి కాదు.. ఏకంగా భూమి తిరగడాన్నే స్లో చేసేసింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top