Queen Elizabeth II: ఎలిజబెత్‌-2 వివాహానికి ఖరీదైన డైమండ్‌ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు

Nizam of Hyderabad Gifted 300 Diamond Studded Necklace To Queen Elizabeth II - Sakshi

క్వీన్‌ ఎలిజబెత్‌2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్‌ రాణిగా ఉన్న ఎలిజబెత్‌.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్‌ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు.  

క్వీన్‌ ఎలిజబెత్‌కు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్ర‌క‌టించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజ‌బెత్ మ‌హారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్‌ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. 1961లో తొలిసారి భార‌త్‌ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్‌ భార‌త్‌లో ప‌ర్య‌టించారు.

క్విన్‌ ఎలిజబెత్‌ వివాహానికి హైదరాబాద్‌ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్‌ ఎలిజబెత్‌ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్‌ ప్లాటినమ్‌ నెక్లెస్‌ సెట్‌ను అప్పటి  నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ యువరాణిగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రిన్సెస్‌ ఎలిజబెత్‌ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్‌ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. 
చదవండి: King Charles: బ్రిటన్‌ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే

తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో  పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్‌ రాయల్‌ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి.  ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. 

రాణి నెక్లెస్‌ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో జూలై 21న పోస్ట్‌ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్‌ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్‌ను ఎలిజబెత్‌ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్‌లో ధరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top