అమెరికాలో మరో భారతీయుని అరెస్టు

Indian arrested in US over money scam targeting senior citizens - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో సీనియర్‌ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో తాజాగా మరో భారతీయుడు అరెస్టయ్యాడు. వర్జీనియాకు చెందిన అనిరుధ్‌ కల్‌కోటెను (24) శుక్రవారం హూస్టన్‌లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్‌ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్‌ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు.

హూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్‌ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్‌మిటర్‌ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాజేశారు. మహమ్మద్‌ ఆజాద్‌ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడన్నది అనిరుధ్‌పై అభియోగం. ఆజాద్‌ను 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top