బ్రెజిల్‌లో కరోనా ఉగ్రరూపం | High Coronavirus Cases Recording In Brazil | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో కరోనా ఉగ్రరూపం

Aug 6 2020 9:38 AM | Updated on Aug 6 2020 9:38 AM

High Coronavirus Cases Recording In Brazil - Sakshi

బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 28,59,073కు చేరగా.. 97,256 మంది మృత్యువాతపడ్డారని ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,154 మంది మృతి చెందారని పేర్కొంది.

ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది బ్రెజిల్‌లోనే. అమెరికాలో ఇప్పటివరకు 49లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా  ఇప్పటివరకు 18.6 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు. కాగా కరోనా కారణంగా ఇప్పటివరకు 7లక్షలకు పైగా మృతి చెందారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత జాన్స్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఇక భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 50వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 19లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 37వేలు దాటింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement