శభాష్‌... సుభాష్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

శభాష్‌... సుభాష్‌రెడ్డి

Feb 17 2026 8:11 AM | Updated on Feb 17 2026 8:11 AM

శభాష్

శభాష్‌... సుభాష్‌రెడ్డి

మహిళా రైతు సంఘాలు బలపడాలి ఆలయంలోకి రానివ్వడం లేదు!

చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన పాశం సుభాష్‌రెడ్డి సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో అత్యధికంగా 99.823 పర్సంటైల్‌ సాధించాడు. విజయవాడలోని ప్రవేట్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల జరిగిన జేఈఈ పరీక్షకు హాజరయ్యాడు. అన్ని సబ్జెక్ట్‌లలోను 99% పర్సంటైల్‌ నమోదు చేశాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. సుభాష్‌రెడ్డి అత్యధిక మార్కులు సాఽధించటంతో తల్లిదండ్రులు రామిరెడ్డి, అశ్విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు సుభాష్‌రెడ్డిని అభినందించారు. పదవతరగతిలోను 586 మార్కులు సాధించాడు.

వెలుగు డీఆర్డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సింగయ్య

చినగంజాం: రైతుల ప్రయోజనాల కోసమే మహిళా రైతు సంఘం పనిచేస్తుందని వెలుగు డీఆర్డీఏ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ బి. సింగయ్య అన్నారు. మండల వెలుగు డీఆర్డీఏ ఆధ్వర్యంలో సోమవారం వెలుగు కార్యాలయంలో నిర్వహించిన గోతాల పంపిణీ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సింగయ్య రైతులకు గోతాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగకరమైన విధంగా మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పని చేస్తుందని, దీని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలను అద్దె రూపంలో ఇస్తారన్నారు. గోతాలను మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు ఇస్తారని, మండలంలోని రైతులందరూ ఉపయోగించుకోవాలన్నారు. పండించిన పంట కూడా గిట్టుబాటు ధర తీసుకురావాలని ఉద్దేశంతో సమాఖ్య పనిచేస్తుందని, మండలంలో అత్యధికంగా శనగ, జొన్న, వరి, రాగులు మొదలైన పంటలు పండించారని తెలిపారు. వీటికన్నింటికి గిట్టుబాటు ధర తీసుకురావడానికి సమాఖ్య పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎం రవీంద్ర, సర్పంచ్‌ రాయని ఆత్మారావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు శారద, ఎఫ్‌ఈఓ అధ్యక్షులు అంజనీదేవి, నాయకులు పొద వీరయ్య, నరహరి శ్రీను, సందు శ్రీను, సత్యం, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు.

నాదెండ్ల: చిరుమామిళ్ళలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో తమను రాకుండా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని దేవస్థానం సింగిల్‌ ట్రస్టీ కొల్లిపర సాంబశివరావు, ప్రధాన అర్చకుడు కొల్లిపర పాపారావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఎప్పటి నుంచో ఆలయం ట్రస్టీగా, పూజారిగా వ్యవహరిస్తున్నామని, ఆదివారం ఆలయానికి వెళ్లిన తమను గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీనివాస్‌, కొమ్మసాని గంగిరెడ్డి అడ్డుకున్నారని వాపోయారు. తమ కుటుంబ సభ్యులను దుర్భాషలాడటమే కాక చంపుతామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

శభాష్‌... సుభాష్‌రెడ్డి1
1/2

శభాష్‌... సుభాష్‌రెడ్డి

శభాష్‌... సుభాష్‌రెడ్డి2
2/2

శభాష్‌... సుభాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement