ఈ బ్లెండర్‌ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, ఏకంగా అన్ని వేలా! | Sakshi
Sakshi News home page

ఈ బ్లెండర్‌ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, ఏకంగా అన్ని వేలా!

Published Mon, Nov 27 2023 4:39 PM

High Speed Vacuum Blender To Make Juices Easy And Fresh - Sakshi

పిండి, నూక, చట్నీ, జ్యూస్‌ ఇలా.. మిక్సీ లేకుండా వంటింట్లో ఏ పనీ సాగదు. చిత్రంలోని ఈ డివైస్‌.. వినూత్నమైన వాక్యూమ్‌ టెక్నాలజీతో డిమాండ్‌ క్రియేట్‌ చేసుకుంది. బ్లెండింగ్‌ చేయడానికి ముందు బ్లెండర్‌ జార్‌ నుంచి గాలిని పూర్తిగా తీసివేసి.. ఆహారాన్ని సాధారణ బ్లెండర్‌ కంటే స్మూత్‌గా చేస్తుంది. అందుకే ఇందులోని ఫుడ్‌ లేదా జ్యూస్‌ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఈ ప్రొఫెషనల్‌ బ్లెండర్‌తో.. జ్యూస్‌లు, బేబీ ఫుడ్‌ (నెలల పిల్లలకు), మిల్క్‌ షేక్స్‌ ఇలా చాలావాటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈ ఫుడ్‌ ప్రాసెసర్‌ బ్లెండర్‌లో మిలిటరీ–గ్రేడ్‌ లేజర్‌ స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ బ్లేడ్స్‌ అమర్చి ఉంటాయి. అత్యంత పదునైన ఈ బ్లేడ్స్‌.. ఎంతటి ఘనపదార్థాలనైనా మెత్తటి మైనంలా మార్చగలవు. ప్రొఫెషనల్‌ సౌండ్‌ప్రూఫ్‌ కవర్‌ కలిగిన ఈ డివైస్‌.. సాధారణ డివైస్‌ల కంటే.. 40 శాతం సౌండ్‌ని తగ్గిస్తుంది. ఈ కంటైనర్‌ సుమారుగా ఆరు నుంచి ఎనిమిది మందికి సరిపడా ఫుడ్‌ని లేదా జ్యూస్‌ని అందిస్తుంది. దీని ధర 807 డాలర్లు (రూ.67,116).

Advertisement
 
Advertisement