Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే!

Madhuri Dixit- Beauty Secret: అందం, అభినయానికి తోడు తనవైన స్టెప్పులతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన అలనాటి హీరోయిన్ మాధురీ దీక్షిత్. తొంభయవ దశకంలో యువత కలల రాణిగా వెలుగొందిన ఈ ముంబై నటి.. యాభై పదుల వయసులోనూ అందంతో కట్టిపడేస్తోంది. తన చర్మ సౌందర్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఇటీవల అభిమానులతో పంచుకుంది.
వయసును దాచేసే మంత్రం!
‘‘వయసుని కనిపించనివ్వని చర్మ సౌందర్యానికి ఏం చేస్తున్నారేంటి అని అభిమానులే కాదు.. నా తోటి నటీమణులూ అడుగుతుంటారు. స్కిన్‌కేర్ విషయంలో నేను ఇంటి చిట్కాలనే నమ్ముతా.. అది మా అమ్మమ్మ నుంచి నేర్చకున్నా.
శనగపిండిలో కాసిన్ని తేనె చుక్కలు.. కొంత నిమ్మరసం కలిపి మొహానికి పట్టిస్తా.. పాలల్లో ముంచిన కీరా దోసకాయ ముక్కలను కళ్ల మీద పెట్టుకుని ఓ ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవుతా. తర్వాత చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటా. ఇలా వారానికి మూడుసార్లు చేస్తానంతే!’’ అంటూ తన బ్యూటీ సీక్రెట్ వెల్లడించింది మాధురి దీక్షిత్. కాగా 70కి పైగా సినిమాల్లో నటించిన మాధురీ.. టీవీ షోల్లో జడ్జీగా అభిమానులను అలరిస్తోంది.
సంబంధిత వార్తలు