గ్రామాలను కమ్మేసిన పొగమంచు
జీడిమామిడి, మామిడి పూతలకు దెబ్బ
దేవరపల్లి: పొగమంచు గ్రామాలను కమ్మేసింది. మంచుకు రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 8.30 గంటల వరకు మంచు విడవలేదు. సోమవారం ఉదయం 4 నుంచి 8.30 గంటల వరకు మంచు పడింది. కొద్దిపాటి వర్షపు తుంపరలా మంచు కురవడంతో మామిడి, జీడిమామిడి రైతులు కలవరపడుతున్నారు. మంచుకు పూతలు మాడిపోతాయని రైతులు వాపోతున్నారు. రాత్రి చలి తీవ్రత, తెల్లవారు జామున మంచుకురవడం వల్ల పూతలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జీడిమామిడి, మామిడి పూతలు ఆశాజనకంగా ఉండగా, మంచుకు దెబ్బతింటాయని రైతులు అంటున్నారు. మంచుకు రహదారులు కనిపించక వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలను నడిపారు. హైవేను మంచు పూర్తిగా కప్పేయడంతో లారీలను రోడ్డు పక్కన నిలుపుదల చేశారు.
దేవరపల్లి పల్లంట్ల రోడ్డును కమ్మేసిన పొగ మంచు
గ్రామాలను కమ్మేసిన పొగమంచు


