పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన
పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని యూటీఎఫ్ ఇచ్చిన పిలుపునకు ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు. సీఎం చంద్రబాబుకు పోస్టుకార్డులు రాస్తూ తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు.
– ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్, యూటీఎఫ్ అధ్యక్షుడు,
తూర్పుగోదావరి జిల్లా
హామీలను నెరవేర్చాలి
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఉపాధ్యాయు లకు పలు హామీలను ఇచ్చారు. వాటిని నెరవేర్చాలి. 29 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి.
– ఎంటీవీఏఎస్ సుబ్బారావు, యూటీఎఫ్
ప్రధాన కార్యదర్శి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా
పాఠశాలలను
బలోపేతం చేయాలి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. పాఠశాలల్లో తగిన సదుపాయాలను మెరుగుపర్చాలి.
– సీహెచ్ సూరిబాబు,
యూటీఎఫ్ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా
బోధనేతర పనులను రద్దు చేయాలి
ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేయాలి. విద్యార్థులకు బోధన చేసేందుకు సమయాన్ని పూర్తిగా కేటాయించే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి.
– కె.కృష్ణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన
కార్యదర్శి, పోలవరం జిల్లా
పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన
పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన
పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన


