పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

పోలీస

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. వారి నుంచి ఎస్పీ డి.నరసింహకిశోర్‌ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సివిల్‌ కేసులు, కుటుంబ సమస్యలు, ఛీటింగ్‌, కొట్లాట కేసులకు సంబంధించిన అర్జీలు స్వీకరించామన్నారు.

బీసీల వర్గీకరణ అవసరం

వారు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారు

సీపీఐ నేతలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వెనుకబడిన తరగతులు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీనియర్‌ నాయకుడు కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కాకినాడ సూర్య కళా మందిరంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట నిర్వహిస్తుందని చెప్పారు. జనగణనలో భాగంగా కులగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందన్నారు. బీసీల్లోని వివిధ ఉప కులాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ఎ, బి, సి, డి కేటగిరీలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్ని కులాలకు, వర్గాలకు సమాన అవకాశాలు లభించినప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లని అన్నారు. కులవృత్తిదార్లకు చిన్న చిన్న పరికరాలు అందించి ఓట్లు దండుకుంటున్నారని, ఇది వారి అభివృద్ధి, సంక్షేమం కాదని, ఆధునిక బానిసత్వమని అన్నారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరుగులు పెడుతూంటే మన దేశంలో కులాలకు, కుల వృత్తులకు బీసీలను కట్టిపడేస్తున్నారని అన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ, జనగణనలో భాగంగా కులగణన జరిపించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ తీర్మానం చేసి, అందుకు కావలసిన కార్యాచరణ అమలు చేసే విధంగా ముందుకు కదలాలని కోరారు. ఆయా పార్టీలపై బీసీ నాయకులు ఒత్తిడి తేవాలన్నారు. జనగణనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సమగ్రంగా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు, నాయకులు అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు 1
1/1

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement