
బిడ్డలతో తల్లి విజి (ఫైల్)
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో నీటి తొట్టెలో ముంచి ఇద్దరు పిల్లలను హత్య చేసి తల్లి.. ఆ తరువాత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కుళితురై సమీపంలోని కలువన్ దిట్ట కాలనీ ప్రాంతానికి చెందిన జబషైన్ (35). కేరళలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య విజి (27). వీరికి ప్రియ (02), ఆరు నెలల వయసున్న ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. జబషైన్ కేరళలో పని చేస్తూ ఉండడంతో విజితో జబషైన్ తల్లి రాజమ్మాల్ నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాజమ్మాల్ ఆలయంకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటిలో ఉన్న నీటి తొట్టెలో ఇద్దరు మనవరాళ్లు మృతి చెంది తేలుతుండడంతో స్థానికులకు తెలియజేసింది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ విజి ఉరేసుకుని మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమా చారం అందించారు. వారు బిడ్డలు, విజి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.