ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్‌ విధింపు

Man Stabbed Outside Mangaluru Shop By Masked Attackers - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. 

కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు. భయంతో అతను పరుగులు తీసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వాళ్లు పారిపోగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆపై అతను మరణించినట్లు తెలుస్తోంది.

ఘటన తర్వాత సురత్కల్‌ను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్‌. 144 సెక్షన్‌ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.  

ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్‌ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా.

ఇదీ చదవండి: ఘోరం.. కుప్పకూలిన మిగ్‌–21.. ఇద్దరు పైలట్ల దుర్మరణం  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top