
సాక్షి, కరీంనగర్: కరోనా భయం, మానసిక ఆందోళన ఓ బ్యాంకు ఉద్యోగిణిని బలి తీసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన రుబ్బ వాణి ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కరీంనగర్ మంకమ్మతోటలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు దూరంగా మంకమ్మతోటలో ఓ టీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెలలో వాణి తండ్రి కరోనాతో మృతి చెందారు. తల్లికి పాజిటివ్ అని తేలింది. దాంతో మానసిక వేదనకు గురైన వాణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా భయం, తండ్రి మృతే ఆతమ్యహత్యకు కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. వాణి ఆత్మహత్య స్థానికంగా కలకలం సృష్టించింది.