ప్రియుడి గదిలో బాలిక ఆత్మహత్య 

Girl Eliminates Herself By Hanging In Rajendra Nagar - Sakshi

అత్తాపూర్‌: పెళ్లి విషయంలో మాటామాటా పెరిగి ప్రేమికుడి గదిలో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. పాండురంగానగర్‌ ప్రాంతానికి చెందిన నర్సింహులు కుమార్తె (17) వికారాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. శ్రీకాంత్‌ హైదర్‌గూడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 

కాగా తరచూ శ్రీకాంత్‌ దగ్గరకు వస్తుండే ప్రవీణ గురువారం కూడా అలాగే వచ్చింది. పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్‌ను కోరడంతో అతను కొంత సమయం కావాలన్నాడు. ఈ విషయంలో కాసేపు ఇద్దరు గొడవపడ్డారు. అనంతరం శ్రీకాంత్‌ బయటకు వెళ్లిన సమయంలో ప్రవీణ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం)

కల్వర్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరికి తీవ్రగాయాలు  
బొంరాస్‌పేట: మద్యం మత్తులో బైక్‌నడుపుతూ కల్వర్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  మండల పరిధిలోని వడిచర్లకు చెందిన వడ్ల విఠల్‌(40), మంగలి వేణు(30) సాయంత్రం కొడంగల్‌ నుంచి ద్విచక్రవాహనంపై గ్రామానికి తిరిగి వస్తుండగా రేగడిమైలారం శివారులోని బాపనోనిబావి సమీపంలోని కల్వర్టును ఢీకొట్టారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిలో విఠల్‌ పరిస్థితి విషమంగా ఉందని ఆయన్ను వెంటనే పరిగి ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్నందునే ప్రమాదం జరిగిందని ఎస్సై శ్రీశైలం తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top