మార్కెట్‌లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్‌!

Sony launches Rs 2.99 lakh 65-inch Bravia XR A80J OLED TV in India   - Sakshi

మరోకొత్త స్మార్ట్‌ టీవీ విడుదల

వెబ్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ కొత్త టీవీని లాంచ్ చేసింది. సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్‌ ఈడీ సిరీస్‌ కింద ఈ స్మార్ట్‌ టీవీని విడుదల చేస‍్తున్నట్లు సోనీ ప్రతినిధులు తెలిపారు. దీని ధర రూ.2.99లక్షలుగా నిర్ణయించారు.

ఫీచర్స్‌ విషయానికొస్తే

ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ  

టీవీ ఇంచెంస్‌ : 65 అంగుళాలు

ఓఎల్‌ఇడి ప్యానెల్‌ 

ఎక్స్‌ ఆర్‌ కాగ్నిటీవ్‌ ప్రాసెసర్‌.   

ఎక్స్‌ఆర్ సౌండ్ పొజిషనింగ్ ద్వారా ఎకౌస్టిక్ సర్ఫేస్ ఆడియోని 3డి సరౌండ్ అప్‌స్కేలింగ్‌తో జాగ్రత్త తీసుకుంటుంది. కొత్త బ్రేవియా టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. గేమ్స్‌ ఆడేందుకు వీలుగా బ్రేవియా  ఎక్స్‌ఆర్ ఏ80జె  డిజైన్‌ చేసినట్లు, అందులో  గేమ్ మోడ్, హెచ్‌డిఎంఐ 2.1 సపోర్ట్‌, 4 కె 120 ఎఫ్‌పిఎస్, విఆర్‌ఆర్, ఎల్‌ఎల్‌ఎం ఉన్నాయి. గేమ్‌ను  ఆస్వాధించి, ధ్వనిని ఆప్టిమైజ్ చేసే యాంబియంట్ ఆప్టిమైజేషన్, లైట్ సెన్సార్,ఎకౌస్టిక్ ఆటో-కాలిబ్రేషన్ ఇందులో ఇమిడి ఉన్నాయి.  గూగుల్ అసిస్టెంట్ , గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్‌కు  సపోర్ట్‌ ఇస్తుంది. అలెక్సా స్మార్ట్ పరికరాలు, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్‌కిట్‌లతో కూడా పనిచేస్తుంది.

గేమ్స్‌ ఆడుకోవచ్చా?
నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన బ్రేవియా ఎక్స్‌ఆర్ ఏ80 జేఓఎల్‌ఈడి  లో ఉపయోగించిన  ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌  కలర్‌, కాంట్రాస్ట్‌, తదితర ఫీచర్లు హుమన్‌ బ్రెయిన్‌ తరహాలో విశ్లేషిస్తుంది. ఈ ఏఐ వల్ల టీవీలో వచ్చే దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది.  ఈ సందర్భంగా సోనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. త్వరలో 77 అంగుళాల వేరియంట్‌తో సహా ఈ సిరీస్‌లో కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు.
చదవండి: Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top