బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్స్‌కి ప్రత్యేక వర్గీకరణ | RBI Draft Rules to Standardize Business Correspondent Categories | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్స్‌కి ప్రత్యేక వర్గీకరణ

Apr 9 2026 8:24 AM | Updated on Apr 9 2026 8:43 AM

RBI Draft Rules to Standardize Business Correspondent Categories

నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరెస్పాండెంట్స్‌ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్‌ లేదా రెమ్యూనరేషన్‌ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్‌ ఆథరైజేషన్‌కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

ఇందులో బ్యాంక్‌ శాఖలతో పాటు బిజినెస్‌ కరెస్పాండెంట్‌–బ్యాంకింగ్‌ అవుట్‌లెట్‌ (బీసీ–బీవో), బిజినెస్‌ కరెస్పాండెంట్‌–బ్యాంకింగ్‌ టచ్‌పాయింట్‌ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్‌ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్‌బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి 
తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్లు ..రిటైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తుంటారు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement