కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

Ration Cardholders: Central Govt Extends Free Ration Scheme Till December 2023 - Sakshi

కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో తీసుకుని రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా రేషన్‌ పథకం గడువుని పొడిచింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2023 డిసెంబర్‌ వరకు ఉచిత రేషన్‌ అమలు కానుంది.  దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని క్యాబినెట్ సమావేశం తర్వాత ఆహార మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

ప్రస్తుత పొడిగింపు నిర్ణయం అమలు తర్వాత, ఈ స్కీమ్‌ ప్రయోజనం NFSA (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద లబ్ధిదారులకు ప్రయెజనాలను అందివ్వనున్నారు.  2020 నుంచి ప్రత్యేక PMGKAY పథకం కింద ప్రజలకు లబ్ధిచేకూరేది.

నివేదికల ప్రకారం, దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. దీని వలన ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది.  2020లో కోవిడ్‌  ఫస్ట్‌ వేవ్‌ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ఈ ఏడాది డిసెంబర్‌ వరకు పొడిగించగా.. తాజాగా మరో ఏడాదికి ప్రయోజనాన్ని పెంచింది.

చదవండి: బీభత్సమైన ఆఫర్‌: జస్ట్‌ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్‌! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top