Mukesh Ambani: అంబానీ తెలివి.. రెండూ లాభాలిచ్చేవే!

Mukesh Ambani Enter Green Energy But Still Getting Rich Off Processing Crude Oil - Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన సంపదను మరింత వృద్ధి చేసుకోనున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌లో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు.ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్‌ అంబానీ సంపద మరింత పెరగనుంది.

మనీ మేకింగ్‌ మిషన్‌ 
ముఖేష్‌ అంబానీకి గుజరాత్‌ జామ్‌ నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద‍్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్‌, ప్లాస్టిక్‌, కెమికల్స్‌ను తయారు చేస్తారు. దీని విస్తీర్ణం సుమారు న్యూయార్క్‌ సిటీలో మాన్‌ హాటన్‌ ప్రాంతం సగం వరకు ఉంటుందని అంచనా. తద్వారా పైప్‌లైన్‌ల నెట్‌వర్క్  ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్‌ బెర్గ్‌ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్‌ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత‍్తుల ద్వారా వచ్చిన సంపదే. కాబట్టే ఆర్ధిక వేత్తలు సైతం జామ్‌ నగర్‌ చమురు ఉత్పత్తి కేంద్రం ముఖేష్‌ అంబానీకి మనీ మేకింగ్‌ మిషన్‌ లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

10శాతం తగ్గుతుందేమో!
ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్‌ అంబానీ  భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్‌ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్‌ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని శాన్‌ఫోర్డ్ ఎనలిస్ట్‌ సి. బెర్న్‌స్టెయిన్ అంచనా వేశారు.

గ్లోబల్ వార్మింగ్  దెబ్బ
బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమణ మాట్లాడుతూ..జామ్‌ నగర్‌ చమురు శుద్ధి కేంద్రాల వల్ల పర్యావరణానికి ప్రమాదమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం చేపట్టే ఉత్పత‍్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంకేతాలు వెలువడుతున్నా ముఖేష్‌ అంబానీ పట‍్టించుకోవడం లేదని అన్నారు. అలా చేస్తే రిలయన్స్‌ కూకటి వేళ్లు కదిలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అందుకే గ్రీన్‌ ఎనర్జీపై పెట్టుబడులు?! 
ఈ ఏడాది జూన్‌లో జరిగిన రిలయన్స్‌ వార్షిక సమావేశంలో ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ మొబైల్‌ నెట్‌వర్క్‌లో  జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో..రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్‌ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ చమురు ఉత్పత్తులు తగ్గి రిలయన్స్‌ కూకటివేళ‍్లు కదిలే పరిస్థితి ఎదురైనా.. ముఖేష్‌ అంబానీ కుబేరుడి స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదని జోస్యం చెబుతున్నారు.

చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top