breaking news
Mukesh Ambani-led Reliance Industries Ltd
-
కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే!
ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన సంపదను మరింత వృద్ధి చేసుకోనున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు.ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగనుంది. మనీ మేకింగ్ మిషన్ ముఖేష్ అంబానీకి గుజరాత్ జామ్ నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్‌ను తయారు చేస్తారు. దీని విస్తీర్ణం సుమారు న్యూయార్క్ సిటీలో మాన్ హాటన్ ప్రాంతం సగం వరకు ఉంటుందని అంచనా. తద్వారా పైప్లైన్ల నెట్వర్క్ ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్ బెర్గ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత్తుల ద్వారా వచ్చిన సంపదే. కాబట్టే ఆర్ధిక వేత్తలు సైతం జామ్ నగర్ చమురు ఉత్పత్తి కేంద్రం ముఖేష్ అంబానీకి మనీ మేకింగ్ మిషన్ లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. 10శాతం తగ్గుతుందేమో! ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని శాన్ఫోర్డ్ ఎనలిస్ట్ సి. బెర్న్‌స్టెయిన్ అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమణ మాట్లాడుతూ..జామ్ నగర్ చమురు శుద్ధి కేంద్రాల వల్ల పర్యావరణానికి ప్రమాదమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం చేపట్టే ఉత్పత్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంకేతాలు వెలువడుతున్నా ముఖేష్ అంబానీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలా చేస్తే రిలయన్స్ కూకటి వేళ్లు కదిలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు?! ఈ ఏడాది జూన్‌లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మొబైల్ నెట్‌వర్క్‌లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో..రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ చమురు ఉత్పత్తులు తగ్గి రిలయన్స్ కూకటివేళ్లు కదిలే పరిస్థితి ఎదురైనా.. ముఖేష్ అంబానీ కుబేరుడి స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదని జోస్యం చెబుతున్నారు. చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! -
వారసుడొచ్చాడు!
న్యూఢిల్లీ: సరిగ్గా ముప్పై రెండేళ్ల క్రితం రిలయన్స్ సామ్రాజ్యంలో ధీరూభాయ్ అంబానీ కుమారుడు ముకేశ్ అంబానీ అడుగుపెట్టారు. ఇప్పుడు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ త్వరలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆకాశ్ దీనిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం కావడం విశేషం. దేశవ్యాప్తంగా వైర్లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రంను దక్కించుకున్న రిలయన్స్ జియో... తాజాగా జరిగిన 2జీ వేలంలో అనేక సర్కిళ్లలో స్పెక్ట్రంను కొనుగోలు చేయడం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రిలయన్స్ జియో టెలికం సేవలకు సంబంధించి కీలకమైన మార్కెట్ వ్యూహాన్ని ఖరారు చేయడంలో ఆకాశ్ కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. ‘కంపెనీకి క్రమంతప్పకుండా ఆకాశ్ వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే మనోజ్ మోడి, చైర్మన్ ముకేశ్‌తో సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. రిలయన్స్ జియో గ్రూప్ ప్రెసిడెంట్ సందీప్ దాస్ తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. అయితే, కంపెనీ దీనిపై బయటకు వివరాలను వెల్లడించకపోవడానికి ఆకాశ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉండటం కారణం’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తండ్రి బాటలోనే... 1981లో ముకేశ్ అంబానీ 24 ఏళ్ల వయస్సులో ఆర్ఐఎల్లో చేరారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారత్‌లోనే అతిపెద్ద చమురు రిఫైనరీని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు రిలయన్స్ గ్రూప్ తొలిసారిగా టెలికం వెంచర్లోకి రావడంలో(విడిపోక ముందు) ముకేశ్ చొరవే ప్రధానకారణం. కాగా, ప్రస్తుతం ఆకాశ్ అంబానీ వయస్సు కూడా 22 ఏళ్లు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అండర్ గ్యాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ గతేడాది భారత్‌కు తిరిగొచ్చారు. ముకేశ్‌కు ప్రీతిపాత్రమైన టెలికం రంగంలోనే, అందులోనూ సొంత కంపెనీలోనే తన తొలి కార్పొరేట్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం విశేషం. కాగా, యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ సోదరి ఇషా కూడా త్వరలోనే రిలయన్స్ ఫౌండేషన్‌లో చేరనున్నట్లు సమాచారం. గ్రూప్ నేతృత్వంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, హాస్పిటల్ వెంచర్లు దీని అధీనంలోనే ఉన్నాయి. కాగా, ముకేశ్ రెండో కుమారుడు అనంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.