ఐఐఎల్‌ మీజిల్స్‌–రూబెలా టీకాకు అనుమతి

Indian Immunologicals gets DCGI nod for Measles-Rubella vaccine - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మీజిల్స్‌–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్‌ ఇమ్యునాలాజికల్స్‌ (ఐఐఎల్‌) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్‌ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది.

ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్‌ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్‌ ఎండీ కె. ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్‌ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్‌ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్‌ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్‌ వేక్సిన్‌ను రూపొందిస్తుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top