కరోనా : వారికి ఎస్‌బీఐ భారీ ఊరట

COVID-19 treatment under insurance scheme for retired SBI employees - Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా కాలంలో తన విశ్రాంత ఉద్యోగులకు  ఊరట అందించే వార్త చెప్పింది. ఎస్‌బీఐ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం కొత్త బీమా పథకం ప్రవేశపెట్టింది. ఇందులో కోవిడ్-19 చికిత్స కూడా చేర్చడం విశేషం. మెడికల్ బెనిఫిట్స్ స్కీమ్ కింద క్రానిక్ ఒబెస్ట్రుక్టీవ్ పల్మనరీ డిసీజెస్ (సీఓపీడీ)  లేదా  ఉబ్బసం సహా మరో నాలుగు వ్యాధులతో బాధపడే వారు సైతం ఆసుపత్రిలో చేరేందుకు బ్యాంక్ అనుమతించింది. ఈమేరకు ఎస్‌బీఐ తన రిటైర్డ్ ఉద్యోగులకు  సమాచారాన్ని అందించింది. (ఎస్‌బీ‌ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ )

ప్రస్తుత పథకాన్ని సమీక్షించి ఎస్‌బీఐ ఆసుపత్రిలో ఉన్న వ్యాధుల జాబితాలో కోవిడ్-19 ను అంటువ్యాధిగా చేర్చాలని నిర్ణయించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇప్పుడు 20 నుండి 25 వరకు వ్యాధుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇంట్లో కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ పథకంలో సభ్యులకు గృహ చికిత్స కోసం రూ. 25000 వరకు ఖర్చును అనుమతించాలని నిర్ణయించింది. దీంతో కోవిడ్ కోసం అదనంగా మరో బీమాను కొనుగోలు చేయనవసరం లేదని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య సంస్థ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. కాగాఎస్‌బీఐ ప్రస్తుత ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స  కవరేజ్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top