Amazon AWS Outage: కొద్దిగంటలు నిలిచిపోయిన అమెజాన్‌ సర్వీసులు

Amazon Web Services Outage Effect Interrupt Prime Netflix Alexa - Sakshi

Amazon Web Services Outage Details: అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ పరిధిలోని వెబ్‌ సైట్లన్నింటికి కాసేపు విఘాతం ఏర్పడింది. అమెజాన్‌ షాపింగ్‌ సైట్‌తో పాటు ప్రైమ్‌ వీడియో, వెబ్‌ సర్వీసెస్‌కి అనుబంధంగా ఉన్న సైట్లు సైతం నిలిచిపోయాయి. క్రిస్మస్‌, ఇయర్‌ ఎండ్‌ సీజన్‌ కావడంతో షాపింగ్‌ ఊపులో ఉన్న యూజర్లు.. ఈ విఘాతంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 
 

భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి సమయం నుంచి అమెజాన్‌ వెబ్‌ సర్వీసులకు విఘాతం కలిగింది. అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (API) సంబంధిత సమస్యలతో ఈ విఘాతం ఏర్పడినట్లు అమెజాన్‌ వెల్లడించింది. అయితే ఈ విఘాతం అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10.40ని. కి ఏర్పడిందని, అమెరికా ఈస్ట్‌-1 రీజియన్‌ వరకే పరిమితమైందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

అమెజాన్‌ వెబ్‌ సర్వీసుల అంతరాయంతో ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీఫ్లస్‌, రాబిన్‌హుడ్‌ లాంటి యాప్స్‌ సేవలకు సైతం విఘాతం ఏర్పడింది.  సుమారు 24 వేలమంది అంతరాయంపై ఫిర్యాదులు చేశారని అమెజాన్‌ కంపెనీ తన స్టేటస్‌ డాష్‌బోర్డులో  పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఇలా వెబ్‌ సంబంధిత సర్వీసులకు విఘాతం ఏర్పడడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో ఫాస్ట్‌లీ కంపెనీ (అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కు పోటీ కంపెనీ) సేవలకు సైతం అంతరాయం ఏర్పడి.. రెడ్డిట్‌, అమెజాన్‌, సీఎన్‌ఎన్‌, పేపాల్‌, స్పోటీఫై, అల్‌ జజీరా మీడియా నెట్‌వర్క్‌, ది న్యూయార్క్‌ టైమ్స్‌లు కొద్దిగంటల పాటు నిలిచిపోయాయి. 

చదవండి:  అమెజాన్‌ బాస్‌ పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top