3 కోట్ల నోట్లు, 6 కిలోల స్వర్ణం, 3 కిలోల వెండితో ‘మహాలక్ష్మి’ 

Vasavi Matha Mahalakshmi In The Decoration Of 3 Crore Currency In Vizag - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): విశాఖ కురుపాం మార్కెట్‌ సమీపంలో కొలువైన కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వాసవీమాత మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్‌కు పాలు, పెరుగు, గంధం, తేనె వంటి 108 సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వర్ణవస్త్రసహిత సకలాభరణాలు, 108 స్వర్ణ పుష్పాలతో నివేదన గావించారు. ఆలయ గర్భగుడిలో 6 కిలోల స్వర్ణాభరణాలు, బంగారు బిస్కెట్లు, 3 కిలోల వెండి వస్తువులు, బిస్కెట్లతో పాటు రూ.3 కోట్లు విలువైన భారతీయ కరెన్సీతో ఇలా అలంకరించారు.

చదవండి: శ్రీరస్తు.. శుభమస్తు.. ‘కళ్యాణమస్తు’     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top