Times Now ETG Survey: ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ | Times Now ETG Survey Says YSRCP won all 25 Lok Sabha seats | Sakshi
Sakshi News home page

Times Now ETG Survey: ఫ్యాన్‌దే ప్రభంజనం

Dec 14 2023 4:47 AM | Updated on Dec 14 2023 3:51 PM

Times Now ETG Survey Says YSRCP won all 25 Lok Sabha seats - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ గెలిచే స్థానాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయ­మని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. టీడీపీ గరిష్టంగా ఒక స్థానంలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. జనసేన ఖాతా తెరిచే అవకాశమే లేదంది. టైమ్స్‌నౌ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్‌నౌ ఛానల్‌ ప్రసారం చేసింది.


ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ.. ప్రస్తుతం మరింత బలపడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24–25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది తేల్చింది. గత ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమా­భి­వృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగింది. అందుకే ఆ పార్టీ 22 లోక్‌సభ స్థానాల నుంచి 25 లోక్‌సభ స్థానాల్లోనూ క్వీన్‌ స్వీప్‌ చేసి, తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని విశ్లేషించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement