ఏప్రిల్‌ 14 నాటికి అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం పూర్తి

Meruga Nagarjuna says about construction of Ambedkar statue - Sakshi

మంత్రి డాక్టర్‌ మేరుగ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం, స్మృతివనం వనులు పూర్తి చేయాలని మంత్రుల కమిటీ చైర్మన్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు.

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణ పనులను బుధవారం ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మంత్రి మేరుగ పరిశీలించారు. ముందుగా నమూనా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మేరుగ మీడియాతో మాట్లాడుతూ ప్రతి 15 రోజులకోసారి నిర్మాణ పనులను సమీక్షిస్తామని, సీఎం జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top